KKD: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో వేండ్ర త్రినాధరావు గురువారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్ననే బాధ్యతలు స్వీకరించిన ఈవో, తేటగుంటలోని క్యాంప్ కార్యాలయంలో యనమలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలను మరింత మెరుగుపరచాలని యనమల ఆయనకు సూచించారు.