WGL: వరద బాధితులు సీఎం రేవంత్ రెడ్డి హామీ చేసిన రూ. 15,000 పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్నో రోజులు గడిచినా సహాయం అందకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. అధికారులు బాధితులను కలిసి వారి సమస్యలను వినిపించారు.