ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.