BDK: పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డ్ సభ్యులు సహా వారి అనుచరులు ఎవరూ ఊరేగింపులు, వేడుకలు నిర్వహించరాదని మణుగూరు తహసీల్దార్ నరేష్ గురువారం స్పష్టం చేశారు. ఈ నెల 17 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, కోడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ప్రజలు, అభ్యర్థులు నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు.