GDWL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. గద్వాల, ధరూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నడవలేని వృద్ధులను జాగ్రత్తగా తీసుకెళ్లి ఓటు వేయించాలని ఆదేశించారు.