MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ సామాన్య వ్యక్తిలా క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భాగంగా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలోని పాఠశాలలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.