SKLM: క్రీడల్లో విద్యార్థులు ముందుకు రావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి స్కూల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచిస్తూ, ప్రభుత్వం అన్ని విధాల వారికి సహకారం అందిస్తుందని అన్నారు.