CTR: మండపేట నియోజకవర్గంలోని పంచాయతీ లింకు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 22.76 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. అధ్వానంగా ఉన్న రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.