జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్లో ఓ వృద్దుడు సాహసం చేశాడు. ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 105 సంవత్సరాల కంతి లాడే లింగన్న అనే వృద్ధుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువత బద్దకాన్ని వీడి ఓటేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.