VSP: సింహాచలం పుణ్యక్షేత్రానికి డబుల్ డెక్కర్ బస్ సర్వీస్ ప్రారంభమైంది. విశాఖలో పర్యాటక ఆకర్షణగా ఉన్నఈ ఎలక్ట్రిక్ బస్సులను గురువారం నుంచి సింహాచలం వరకు పొడిగించారు. పర్యాటక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నగర పర్యాటకులతో పాటు, అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారుతుందని అధికారులు తెలిపారు.