ప్రకాశం: పీసీపల్లి మండలంలో ఒకే రోజు మూడు గ్రామాల్లో ఐదు ఆలయాల్లో అర్ధరాత్రి దుండగులు హుండీలు చోరీచేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. మండలంలోని అడవిలోపల్లిలో ని దుర్గమ్మ,రామాలయం, అన్నపురెడ్డిపల్లి లోని వీరబ్రహ్మహేంద్రస్వామి దేవస్థానం, కోదండ రామాపురంలో ఆంజనేయస్వామి ఆలయాల్లో దొంగలు పడి హుండీలు, నగలు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.