ఇవాళ 1950కి పైగా విమానాలు నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. వీటిలో సుమారు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు వివరించింది. నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగా జరుగుతోందని పేర్కొంది. తన కార్యకలాపాలను బలోపేతం చేస్తూనే ఉందని రోజురోజుకూ సేవలను మెరుగుపర్చుతున్నట్లు తెలిపింది. నడ నెట్‌వర్క్‌లోని 138 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నట్లు వెల్లడించింది.