VSP: సింహాద్రి అప్పన్న స్వామి చందన దీక్షను ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, శ్రీనివాస్ ఆచార్యులు గురువారం ప్రారంభించారు. పూజలు నిర్వహించి వందలాదిమంది స్వాములు దీక్ష స్వీకరించారు. రెండో విడత జరుగుతున్న ఈ దీక్ష కార్యక్రమంలో ఏఈవో తిరుమలేశ్వర్రావ్ పాల్గొన్నారు. మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించి పూజలు చేశారు.