ADB: గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇవాళ ఇచ్చోడ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదన్నారు. ప్రతి ఓటర్కి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని కోరారు.