W.G: పెంటపాడు మండలంలో ఖరీఫ్ సీజన్ లక్ష్యం 52 వేల టన్నులు కాగా, ఇప్పటివరకు 43,600 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు AO చీర్ల రవికుమార్ తెలిపారు. దాళ్వా సీజన్లో రైతులు ఎమ్ టీయూ 1121, 1293 రకాలను సాగు చేయాలని సూచించారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు యూరియాకు బదులుగా, పురుగుమందులతో కలిపి ‘నానో యూరియా’ పిచికారీ చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.