అనంతపురం రూరల్ మండలం కురుగుంటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను, కళాశాలను గురువారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాల దేవి అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, విద్యార్థులకు అందిస్తున్న వివరాలను పాఠశాల సిబ్బందికి ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు.