SRPT: హుజూర్ నగర్ మండలం లింగగిరిలో సర్పంచ్ ఎన్నిక హాటాపిక్గా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నది. మొత్తం 2,293 ఓట్లు, 10 వార్డులతో ఉన్న ఈ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన మేడి సునీత, బీఆర్ఎస్ మద్దతుతో ఉన్న అమరవరపు జయమ్మ, స్వతంత్ర అభ్యర్థి కామల్ల ధనమ్మ మధ్య గట్టి పోటీ సాగుతోంది. స్థానిక సమీకరణాలు, యువ ఓటర్లు ఫలితాలపై ప్రభావం చూపుతారు అని గ్రామస్థులు తెలిపారు.