కృష్ణా: గుడివాడ గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు గురువారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ను బంటుమిల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 14న గుడివాడలో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని భరోసా ఇచ్చారు.