కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో తాజాగా తీర్పు వెలువడింది. అప్పటి మలయాళ ప్రముఖ నటిపై ఈ లైంగిక దాడి జరగ్గా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు దిలీప్ నిర్దోషిగా తేలాడు. ఈ మేరకు కేరళలోని ఎర్నాకుళం కోర్టు తీర్పు వెలువరించింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. కారులో ఆమెపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి.