SKLM: పలాస M గరుడ ఖండిలో శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు సోమవారం ప్రారంభించారు. డా. కూన అరుణ కుమారి నేతృత్వంలో రోగులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.