SKLM: ఎచ్చెర్ల ఏపీ బేవరేజెస్ గోదాంలో నిల్వ స్థలం తగ్గడంతో లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు అన్లోడింగ్ ఆలస్యమవుతోంది. జిల్లాలోని మద్యం షాపులు, బార్లకు సరఫరా ఇక్కడి నుంచే కావడంతో వాహనాలు ఎక్కువగా చేరుతున్నాయి. కొన్నిసార్లు 10 రోజులు వరకూ వేచి చూడాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు.