NLG: మునుగోడు మండలం కొయ్యలగూడెంలో 12 ఏళ్ల తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో చివరిగా 2013లో ఎన్నికల్లో పాల్గొన్న గ్రామస్థులు, తరువాత విభజనకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించారు. ఏడేళ్లుగా కార్యదర్శి పాలన సాగింది. సమస్యలు పరిష్కారం కాలేదని గ్రహించిన ప్రజలు ఈసారి ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయం తీసుకున్నారు.