నేటి యువత ఆన్లైన్లో లభించే అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్‌కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కేవలం 10 నుంచి 20 నిమిషాల్లో డెలివరీ చేసే యాప్స్ ఉండటం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌లలో లభించే ఉత్పత్తుల్లో సగానికి పైగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్సే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.