జోరు వానతో హీరో విష్ణు విశాల్ ఇంట్లోకి భారీగా వరదనీరు వచ్చింది. ఇంటి పైకి వచ్చి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది సిబ్బంది వచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Vishnu Vishal: తుఫాన్ వల్ల ఏపీ, తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటి నుంచి తమిళనాడులో జోరు వాన.. దీంతో ప్రముఖులు ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరింది. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రకటన అలా చేశారో లేదో.. వెంటనే రెస్క్యూ సిబ్బంది వాలిపోయారు. కరప్పాక్కం ఏరియాకు సిబ్బంది వచ్చారు. విష్ణు విశాల్‌తో పాటు (Vishnu Vishal) అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. రబ్బర్ బోట్లలో వారిని తరలించారు. వీరితోపాటు గుత్తా జ్వాల దంపతులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విష్ణు విశాల్ షేర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి విష్ణు విశాల్ థాంక్స్ చెప్పారు. కష్ట సమయాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోందని అభినందించారు. సెలబ్రిటీలు అయితే ఓకే.. అలానే సామాన్యులను కూడా కాపాడాల్సి ఉంది.