విశాఖ వ్యాలీ జంక్షన్ సమీప సిగ్నల్ పాయింట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటన వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కేజీహెచ్‌కి తరలించి కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.