»Sridhar A Young Man Of Khammam District Died Of A Heart Attack
Heart Attack: జిమ్ కు వెళ్లొచ్చి యువకుడు గుండె పోటుతో మృతి
గుండెపోటుతో ఖమ్మం జిల్లా యువకుడు హఠాన్మరణం. జిమ్ కు వెళ్లిన శ్రీధర్ ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
Sridhar, a young man of Khammam district, died of a heart attack
ప్రస్తుతం అందరిని గుండె పోటు(Heart Attack) మరణ వార్తలు కుదిపేస్తున్నాయి. సాధారణంగా 50 దాటిన వయసులో వచ్చే ఈ జబ్బు ప్రస్తుతం టీనేజ్ కుర్రాళ్లకు కూడా రావడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీధర్ అనే 31 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఖమ్మం జిల్లా బాలపెటకు చెందిన శ్రీధర్ సోమవారం ఉదయం జిమ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మరణించాడు.
శ్రీధర్ కు గతంలో ఓ భారీ ప్రమాదం జరిగినట్లు, కొన్నాళ్ల పాటు చికిత్స పొందినట్లు తెలుస్తుంది. ఉదయం ఆరోగ్యకరంగా జిమ్ కు వెళ్లిన శ్రీధర్ ఇలా హఠత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతుడి తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్ నాయకుడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా పనిచేశారు. శ్రీధర్ మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లాలోని అల్లీపురంలో గరికపాటి నాగరాజు(33) గుండెపోటుతో మృతి చెందారు.