»Somireddy Chandramohan Reddy Said Looted Rs 3 Thousand Crores Of Silica By Ycp Leaders In Nellore District
Somireddy Chandramohan Reddy: వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీ చేశారు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గనుల లీజు పొందిన వారిపై కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా గత మూడేళ్లకు వైసీపీ నేతల ఆధ్వర్యంలో మూడే వేల కోట్ల ఇసుక దోపిడీ స్కాం చేశారని ఆరోపించారు.
ఏపీ నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు(ycp leaders) 3 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. గనుల తవ్వకం విషయంలో లీజులు ఉన్నా కూడా పలువురిని బెదిరించి కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ వసూళ్లకు పాల్పడేవారికి వైసీపీ నేతల మద్దతు ఉన్నట్లు సోమిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కొన్ని రోజుల్లోనే మొత్తం 300 కోట్ల వరకు పెనాల్టీ పేరుతో దోచుకున్నారని పేర్కొన్నారు. ఇసుకను టన్ను రూ.500 నుంచి రూ.700కు అమ్ముకుంటున్న నిర్వహకులను..తమకు మాత్రం 100 రూపాలకే ఇవ్వాలని గొంతు మీద కత్తిపెట్టి బెదిరిస్తున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యనించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు మూడేళ్ల కాలంలో మూడు వేల కోట్ల రూపాయల సిలికా దోపిడీ చేశారని వెల్లడించారు.
అయితే కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకుని నెల్లూరు జిల్లా(nellore district)లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని సోమిరెడ్డి(Somireddy) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇసుక దోపిడీ, జీఎస్టీ ఎగవేత అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తామని సోమిరెడ్డి అన్నారు. ఈ తరుణంలో వైసీపీ చేస్తున్న అక్రమాలు ఓబుళాపురం స్కాం మాదిరిగా ఉందని ఆరోపించారు.
ఈ మైనింగ్ మాఫియా వ్యవహరంలో వైసీపీ నేత విజయ సాయి రెడ్డి హస్తం ఉందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఇసుకను రూ.1,485కు అమ్ముతూ జీఎస్టీ(GST) మాత్రం రూ.700కే కడుతున్నారని గుర్తు చేశారు. అంతేకాదు ఇటీవల వైసీపీ(ycp)లో చేరిన నెల్లూరు మేయర్ భర్త అతి పెద్ద లీజు దారుడని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతనికి కూడా రూ.120 కోట్ల పెనాల్టీ వేసినట్లు తెలిపారు. ఇలా అనేక అక్రమాలు చేస్తున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అవసరమైతే ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.