»Should Kl Rahul Be Dropped From Indias Test Team Chatgpt Shocking Answer
KL Rahul: భారత జట్టు నుంచి రాహుల్‌ను తప్పించాలా? ChatGPT షాకింగ్ ఆన్సార్!
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul)ఫామ్ గురించి ప్రపంచ క్రికెట్లో ఇటీవల చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో రాహుల్ పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. మరోవైపు రాహుల్ ఇటీవల ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేయగా, సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే ఈ సిరీస్‌లో ఇండియా 2-0తో ఆస్ట్రేలియాపై ఆధిపత్య జోరులో కొనసాగుతుంది. ఇంకోవైపు హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తున్న శుభ్ మన్ గిల్ ని పక్కన పెట్టి రాహుల్ అవకాశం ఇవ్వడం పట్ల పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతోపాటు భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్(venkatesh prasad) కూడా రాహుల్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రసాద్ ట్వీట్లకు కౌంటర్ ఇస్తూ రాహుల్ కు మద్దతుగా కామెంట్లు చేశారు.
While Aakash Chopra is defending KL Rahul and finding fault with Venkatesh Prasad for saying KL is in the team because of IPL… Social media can reveal more… pic.twitter.com/FhHOSScnaO
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వ్యక్తి కేఎల్ రాహుల్ ను ఇండియన్ టెస్ట్ జట్టు(indian test team) నుంచి తొలగించాలా? దీంతోపాటు రాహుల్‌ని భారత క్రికెట్ జట్టు నుంచి తొలగించాలా? అనే ప్రశ్నలను ChatGPTని అడిగాడు. దీంతో చాట్ జీపీటీ చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.
కేఎల్ రాహుల్ ను ఇండియన్ టెస్ట్ జట్టు నుంచి తొలగించాలా?
అందుకు సమాధానంగా చాట్ జీపీటీ(ChatGPT)తానొక లాగ్వేజ్ మోడల్ అంటూ చెప్పుకొచ్చింది. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు లేదా పక్షపాతాలు లేవని తెలిపింది. అయితే, KL రాహుల్‌ని భారత క్రికెట్ జట్టు నుంచి తొలగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడే కొంత సమాచారాన్ని అందిస్తానని చెప్పింది. ఆ క్రమంలో కేఎల్ రాహుల్ ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్, గతంలో భారత క్రికెట్ జట్టుకు మంచి ప్రదర్శన ఇచ్చాడంది. అయితే, అతను ఇటీవలి ప్రదర్శనలలో అస్థిరంగా ఉన్నాడని పేర్కొంది. అయితే ఇది జట్టులో అతని స్థానం గురించి ప్రశ్నలకు దారితీసిందని గుర్తు చేసింది. క్రికెట్ ఒక జట్టు క్రీడ అని గమనించడం ముఖ్యమని వెల్లడించింది. అతని గాయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం లేదా కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం వంటి వివిధ కారణాల వల్ల ఆటగాడి ఫామ్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
మరోవైపు అంతిమంగా రాహుల్ ను జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయం జట్టు మేనేజ్మెంట్(management), సెలెక్టర్ల(selectors)పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక ఆటగాడిని తొలగించాలంటే ఇటీవలి ఫామ్, ఫిట్నెస్, జట్టు మొత్తం వ్యూహాం సహా వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించింది. విభిన్న పరిస్థితులలో పలువురు ప్రత్యర్థులపై బాగా రాణించగల సామర్థ్యం ఉండటం జట్టుకు చాలా ముఖ్యమని వివరించింది. ఇక చివరలో KL రాహుల్‌ను భారత క్రికెట్ జట్టు(Indian cricket team) నుంచి తొలగించాలా వద్దా అనేది వివిధ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంది. దీంతోపాటు జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
KL రాహుల్‌ని భారత క్రికెట్ జట్టు నుండి తొలగించాలా?
ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ(ChatGPT)ఇది ఒక కఠినమైన ప్రశ్న అని తెలిపింది. K L రాహుల్ ప్రతిభావంతులైన బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్, అతను 2014 నుంచి టీమిండియా తరపున ఆడుతున్నాడని వెల్లడించింది. అతను తన ODI అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడని, ఇటీవలి వరకు టెస్ట్‌లలో భారత వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని గుర్తు చేసింది. అయితే, ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతను తన ఫామ్, నిలకడతో పోరాడుతున్నాడని తెలిపింది. అతని పేలవమైన పరుగుల తరువాత, రాహుల్ జట్టులో ఉంచబడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన మిగిలిన రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా తొలగించబడ్డాడని వివరించింది.