»Shock For Team India Rohit Sharma Injured His Finger
Rohith Sharma: టీమిండియాకు షాక్..రోహిత్ శర్మ చేతి వేలికి గాయం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.
భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(ICC World Test Championship) ఫైనల్ జరగనుంది. జూన్ 7న లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా(Team India) క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భారత్ ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. మ్యాచ్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్(Practice Match) చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా లండన్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
రేపు మ్యాచ్ జరగనుందనగా నేడు టీమిండియా(Team India)కు షాక్ తగిలింది. ఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) చేతి వేలికి గాయమైనట్లు సమాచారం. ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ వేలికి స్వల్ప గాయమైంది. ప్రాక్టీస్ టైంలో అతని ఎడమచేతి బొటనవేలికి నేరుగా బంతి తగలడంతో ప్రాక్టీస్(Practice) ఆపేశాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohith Sharma) ప్రాక్టీస్ ఆపి విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడుతాడో లేడోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి బావుంటే రేపు మ్యాచ్లో ఉంటాడు. ఈసారి ఎలాగైనా హిట్ మ్యాన్(Hit Man) సెంచరీ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫైనల్(Final)లో రోహిత్ ప్రతాపం చూపుతాడని అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.