»Ram Charan Fans Distributing Buttermilk In Hot Summer At Mumbai Maharashtra
Ram Charan fans: మండు వేసవిలో మజ్జిగ పంపిణీ
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.
మండు వేసవిలో గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు(Ram Charan fans) చల్లటి స్ఫూర్తిగా మజ్జిగను పలువురికి అందజేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి, భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ(buttermilk) ప్యాకెట్లను పంపిణీ చేశారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము స్ఫూర్తి పొందినట్లు ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.
రామ్‌చరణ్ అనగానే సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన గ్రేస్ ఎంత గొప్పగా గుర్తుకొస్తుందో, సొసైటీకి ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా మదిలో మెదులుతాయని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్ ఆపత్కాలంలో కూడా పలు రకాల సాయం చేశారని గుర్తు చేశారు.
తమ స్టార్‌లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని, దయ, కరుణతో వ్యవహరించాలనే ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు అభిమానులు వెల్లడించారు. ఆ క్రమంలోనే మజ్జిగ పంచాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఎదో ఒకటి చేయాలని కోరారు.