TPT: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. జనరల్ కోర్సులో 6,848 మందిలో 6,509 మంది హాజరై, 339 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,358 మందిలో 1,250 మంది పరీక్ష రాయగా, 108 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.