»Rahul Is Pm Modis Biggest Trp Mamata Banerjee Rejects Rahuls Leadership
Mamata Banerjee: మోడీకి రాహుల్ పెద్ద ప్లస్, ఆ లీడర్ షిప్‌కు మమత నో
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నో చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి (Narendra Modi) ఈ కాంగ్రెస్ (Congress) అగ్రనేతనే ఓ టీఆర్పీ అని ఎద్దేవా చేశారు. విదేశీ గడ్డ పైన ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మమత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ విపక్షాలను నడిపిస్తే అధికార పార్టీని అడ్డుకోవడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయనే కమలం పార్టీకి పెద్ద టీఆర్పీ అని, అందుకే కీలక అంశాల పైన దృష్టి మరల్చేందుకు ఆయనను హీరోగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎదుట మోకరిల్లిందని సంచలన ఆరోపణ చేశారు. సీపీఎం, కాంగ్రెస్, బీజేపీలు తృణమూల్ పార్టీకి వ్యతిరేకంగా మైనార్టీలను రెచ్చగొడుతున్నాయన్నారు.
మైనార్టీల్లో తృణమూల్ కు పట్టు ఉన్న ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అదే సమయంలో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తృణమూల్, సమాజ్ వాది పార్టీ కీలక ప్రకటన చేశాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ కు కూడా సమదూరం పాటించాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రం పైన పోరాటం చేస్తామని షాకింగ్ ప్రకటన చేశాయి.
ఇప్పటి వరకు మోడీని, బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఎవరికి వారు పిలుపునిస్తున్నారు. కానీ కార్యాచరణ విషయానికి వచ్చేసరికి మాత్రం నెరవేరడం లేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంది. అధికారంలోకి రాకముందే… అధికారంలోకి వస్తే తామే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని, తామే చక్రం తిప్పాలని ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు. ఈ కారణంగానే విపక్షాలు ఏకం కావడం లేదు.