»Polling For Mlc Elections Continues Peacefully In Telugu States
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఏపీ(ap), తెలంగాణ(telangana) రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్(MLC elections polling) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోలింగ్ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్(voting) ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
అయితే ఐదు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు (Local body MLCs) ఏకగ్రీవం అయ్యాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(mukesh kumar meena) వెల్లడించారు. ఈ ఎన్నికలలో మొత్తం ఓటర్లు – 1,056,720 మంది, 1,538 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గ్రాడ్యుయేట్ (graduate) ఎమ్మెల్సీల ఓటర్లు- 10 లక్షల 519, టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు- 55,842, లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు -3,059 ఓటు హక్కు వినియోగించుకుంటారని.. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 100% వెబ్ కాస్టింగ్, 500 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
ఇటు తెలంగాణలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్-రంగారెడ్డికి సంబంధించి స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్(hyderabad) ఎమ్మెల్సీ(mlc) స్థానాన్ని గతంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ కేటాయించగా.. ఈ సారి కూడా ఎంఐఎంకే మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. దీంతో ఆ పార్టీకే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది.
ప్రస్తుతం ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ( Janardhan Reddy) పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్ హసన్ జాఫ్రీ(Hasan Jaffrey) (ఎంఐఎం) ( MIM) పదవీకాలం మే 1న పూర్తవుతోంది. త్వరలో ఈ రెండు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరుపుతారు.