మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో చెర్రీ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఆ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో చరణ్ పేరు పలకడంలో నోటారో ఇబ్బంది పడ్డారు. అందుకు గాను ఆమె చెర్రీకి అపాలజీ తెలియజేశారు.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఖర్గే స్పష్టం చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. అతడు తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసు’ అని ప్రిన్సిపల్ తెలిపాడు.
ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించిన HCAకు కృతజ్ఞతలు. ఇది కేవలం నాకే కాదు, నా చిత్రానికే కాదు మా భారతీయ సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహన్. జై హింద్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆ...
పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన
పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు తీహర్ జైలులో ఉన్నారు. ఈ అంశంపై శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదన్నారు.
తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తన ఫోటోలను పొందుపరిచింది. 2013లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2021 నుండి సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు.