• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Rahul Dravid: జర్నలిస్ట్ ప్రశ్నకు ద్రావిడ్ అదిరిపోయే సమాధానం

మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ద్రావిడ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

February 16, 2023 / 11:43 AM IST

Lover’s Day రోజు పరారైన ప్రేమజంట కథ విషాదం.. చెరువులో విగతజీవులుగా

కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు. 

February 16, 2023 / 11:32 AM IST

ITR: ఏప్రిల్ 1 నుండి ఐటీ రిటర్న్స్

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.

February 16, 2023 / 10:54 AM IST

Panama Bus Crash : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 39 మృతి.

Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

February 16, 2023 / 10:40 AM IST

Revanth Reddy: కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఎర్రబెల్లి సహకారం

2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

February 16, 2023 / 10:13 AM IST

turkey syria earthquake: 100 ఏళల్లో ఇదే.. ఏకంగా తోట ముక్కలై లోయ ఏర్పడింది

టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.

February 16, 2023 / 09:21 AM IST

Ranji Trophy 2023: ఫైనల్ మ్యాచ్‌..33 ఏళ్ల తర్వాత మళ్లీ గెలుస్తారా?

ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.

February 16, 2023 / 09:15 AM IST

MVD మరో వైరస్ ముంచుకొస్తోంది.. ఇప్పటికే 9 మంది మృతి

కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది.

February 16, 2023 / 09:04 AM IST

Ponguleti Srinivasa Reddy: కరోనా కాలంలో కొత్త సచివాలయం అవసరమా

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.

February 16, 2023 / 08:20 AM IST

Nara Lokesh: విశాఖ ప్రజలకు లోకేష్ హెచ్చరిక! రోజాకు సవాల్

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.

February 16, 2023 / 08:08 AM IST

Donations అత్యంత డబ్బులున్న పార్టీ బీజేపీ, డబ్బుల్లేని పార్టీ ఏదంటే..

వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది.

February 16, 2023 / 08:08 AM IST

salt bae: ప్రముఖ చెఫ్ ఉదారత..టర్కీలో ప్రతి రోజు 5 వేల మందికి ఫ్రీ ఫుడ్

టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

February 16, 2023 / 07:38 AM IST

MLC Kavitha ఇల్లు చక్కబెట్టాం.. ఇక దేశాన్ని చక్కదిద్దుతాం

గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.

February 16, 2023 / 07:24 AM IST

Test Rankings: ICC తప్పిదం, 4 గంటలు భారత్ నెంబర్ 1

నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది.

February 16, 2023 / 07:19 AM IST

నేడే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.

February 16, 2023 / 06:45 AM IST