తాను ప్రీతి నాయక్ ను (medico Preethi) వేధించలేదని నిందితుడు సైఫ్ (Saif) పోలీసుల విచారణలో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు సైఫ్ ను శుక్రవారం రెండో రోజు విచారించారు. ఈ సందర్భంగా తాను సీనియర్ని, నేనంటే భయముండాలి అనడం తప్ప ప్రీతిని వేధించలేదని విచారణలో అన్నట్లుగా తెలుస్తుంది.
వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ కోణాల్లో సైఫ్‌ను ప్రశ్నించారు. అనంతరం సీపీ రంగనాథ్ పర్యవేక్షణలో హన్మకొండ లోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు విచారణ జరిపారు. ఇందులో భాగంగా గత మూడు నెలల్లో ప్రీతి, సైఫ్ వరంగల్‌లోని ఏయే హాస్పిటల్స్ లో కలిసి పని చేశారనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. సైఫ్ చెప్పిన సమాధానాలకు అనుగుణంగా ఆయా హాస్పిటల్స్ నుండి వివరాలు సేకరించారు. వీరు డ్యూటీ చేసే సమయంలో పని చేసిన పీజీ విద్యార్థులను కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెంది ప్రీతి (Preeti) కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతోంది. పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న వరంగల్ ఎంజీఎం(MGM) హాస్పిటల్ లో ట్రైనింగ్ లో ఉండగా సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐదు రోజుల తర్వాత కన్నుమూసింది.
అయితే ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తండ్రి, సోదరి, సోదరుడు .. అందరూ కూడా… ప్రీతిని సైఫ్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు నిన్న సోదరుడు. నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టులోను (Saif remand report) తప్పులు ఉన్నాయన్నారు. సైఫ్ (Saif) తన సోదరిని వేధించగా, ఈ విషయమై హెచ్ఓడీకి (HOD) ఫిర్యాదు చేస్తే, అతను కూడా ప్రీతినే తిట్టినట్లు చెప్పారు. పోలీసులు (Police) ఎవరినో కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరికి విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేయాలని సైఫ్ ఆదేశించినట్టుగా వార్తలను తాను చూసినట్టుగా చెప్పారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.