హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై పెద్ద రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. లోడుతో వేగంగా వెళ్తున్న ట్రైలర్ ట్రక్కు(truck) బస్సు(bus)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు(police) శనివారం పేర్కొన్నారు. మరోవైపు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. షాజాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం దాటికి బస్సు దాదాపు నుజ్జునుజ్జుగా మారింది. బస్సులోని సీట్లు మొత్తం రోడ్డుపైకి దూసుకెళ్లాయి.
లోడుతో వెళుతున్న ట్రైలర్ ట్రక్కు(truck) బస్సు(bus)ను వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు(officers) వెల్లడించారు. మరోవైపు ట్రక్కు డ్రైవర్(driver) నిద్రమత్తులో డ్రైవింగ్ చేసిన కారణంగా ఈ ఘటన సంభవించినట్లు ప్రాథమికంగా అంచానా వేశారు. అయితే ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని పోలీస్(police) అధికారులు వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.