»Fire Accident In Indonesia Jakarta 17 People Died And More Than 50 People Were Injured
Indonesia:లో భారీ అగ్ని ప్రమాదం..17 మంది మృతి, 52 మందికి గాయాలు
ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.
ఇండోనేషియా(Indonesia) రాజధాని జకర్తా(jakarta)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంధన నిల్వ డిపోలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం(fire accident) సంభవించడంతో 17 మంది మృతి చెందారు. అంతేకాదు మరో 52 మందికి గాయాలయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పొరుగు ప్రాంతాల్లో నివసించిన వేలాది మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ప్రజలు(people) భయాందోళనతో పరుగులు తీశారు. మరోవైపు దట్టమైన నల్లటి పొగతో ఆయా ప్రాంతాలు మొత్తం అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 50కిపైగా ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల(fire)ను అదుపులోకి తెచ్చారు.
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీ పెర్టామినా ద్వారా నిర్వహించబడుతున్న ప్లంపాంగ్ ఇంధన నిల్వ స్టేషన్ ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసరాల్లో ఉంది. ఇండోనేషియా(Indonesia) ఇంధన అవసరాల్లో 25% ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. అయితే భారీ వర్షం(heavy rain) సమయంలో పైప్లైన్ పగిలిపోవడంతో మంటలు చెలరేగాయని పలువురు అంటున్నారు. కానీ పిడుగుపాటు వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పెర్టమినా ఏరియా మేనేజర్ ఎకో క్రిస్టియావాన్ చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం వల్ల దేశ ఇంధన సరఫరాకు అంతరాయం కలగదని ఆయన స్పష్టం చేశారు.
బాధిత మృతుల కుటుంబాలకు ఇండోనేషియా రాష్ట్ర యాజమాన్య సంస్థల మంత్రి ఎరిక్ థోహిర్ సంతాపం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, సహాయక చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని అధికారుల(officers)ను ఆదేశించారు. అయితే ప్లంపాంగ్ ఫ్యూయల్ డిపోలో అగ్ని ప్రమాదం ఇది రెండో సారి. ఇప్పటికే 2014లో అగ్ని ప్రమాదం సంభవించగా..సమీపంలోని 40 ఇళ్లకు మంటలు వ్యాపించారు. కానీ అప్పుడు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాల భద్రతా వ్యవస్థలను ఉపయోగించకుండా పెర్టమినా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అక్కడి నేత ఫాహ్మీ రాధీ ఆరోపించారు. 2014 అగ్నిప్రమాదం తర్వాత అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్తులో(future) అగ్నిప్రమాదాలు(fire accidents) జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆయన అన్నారు.