»March 4th Womens Ipl Match At Mumbai Live Telecast On These Jio Cinema And India Sports 18 Channel
WPL 2023:నేడే ఉమెన్ ఐపీఎల్ మ్యాచ్..ఈ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్
మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.
మహిళల ఐపీఎల్(women ipl)2023 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు(cricket fans) సమయం రానే వచ్చింది. మరికొన్నిగంటల్లో ఈ టోర్నీ ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈరోజు మొదటగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్ MI జట్టు కెప్టెన్ గా ఉండగా…బెత్ మూనీ గుజరాత్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.
ఈ మ్యాచులోని ఇండియా స్పోర్ట్స్18 టీవీ(india sports 18 tv), డిస్నీ + హాట్‌స్టార్(disney hotstar), జియో సినిమా యాప్(jiocinema app)లలో లైవ్ స్ట్రీమింగ్(live streaming) ద్వారా చూడవచ్చు. WPL 2023 మొత్తం వివిధ భాషల్లో Sports18 నెట్‌వర్క్‌లలో ప్రసారం చేయబడుతుంది. స్పోర్ట్స్ 18 తెలుగు, కన్నడ, తమిళం సహా పలు భాషల్లో ప్రసారం చేయబడుతుంది.
గుజరాత్ జెయింట్స్(gujarat giants) జట్టులోని ప్లేయర్లు
ఈ ఉమెన్ ఐపీఎల్ లీగ్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరగనుందని ఇప్పటికే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్(arun dhumal) వెల్లడించారు. మరోవైపు ఐదు జట్లకు గాను BCCI మీడియా హక్కులను రూ.951 కోట్లకు విక్రయించడంతో WPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద T20 లీగ్ గా ఇది నిలిచింది.
ఈ ఎడిషన్‌లో ఐదు జట్లు ఉండగా వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్(gujarat giants), ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియోర్జ్ ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ సర్క్యూట్లో వీరు అత్యుత్తమ ప్రతిభను కనబర్చడానికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. మహిళల జట్టు కోసం కొత్తగా ఏర్పడిన కోచింగ్ టీమ్‌లో షార్లెట్ ఎడ్వర్డ్స్ (హెడ్ కోచ్), ఝులన్ గోస్వామి (టీమ్ మెంటార్, బౌలింగ్ కోచ్), దేవికా పల్షికార్ (బ్యాటింగ్ కోచ్) ఉన్నారు. మొదటి సీజన్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(women premier league)లో మొత్తం 20 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రెండు ప్లేఆఫ్ గేమ్‌లతో సహా 23 రోజుల వ్యవధిలో ఆడనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది.