ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు వల్ల విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగా షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. సాధారణ స్థితికి వచ్చిన వెంటనే మీ గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపింది. ఫ్లైట్ స్టేటస్ తెలుసుకునేందుకు యాప్, వెబ్ సైట్లో అప్డేట్గా ఉండాలని సూచించింది.