VSP: విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరంలో ప్రజలు వారి ఇండ్లలో ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో చుక్కలు వేయించి పోలియోను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ పల్స్ పోలియోకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు.