ఆస్కార్ అకాడమీ, యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పాయి. మరో 3ఏళ్ల తర్వాత యూట్యూబ్‌లో ఆస్కార్ అవార్డుల వేడుకలు టెలికాస్ట్ కానున్నాయి. 1976 నుంచి ఆస్కార్ ప్రసార హక్కులను కలిగిన ఏబీసీ సంస్థ ఒప్పందం 2028లో జరిగే 100వ వేడుకతో ముగుస్తుంది. దీంతో 2029-2033 వరకు గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను అకాడమీ యూట్యూబ్‌కి ఇచ్చింది. కాగా, 98వ ఆస్కార్ వేడుక 2026 మార్చి 15న జరగనుంది.