గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం మళ్లీ కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపాలిటీ సిబ్బంది రెండు జేసీబీల సాయంతో కూల్చివేతలు కొనసాగించారు. ఇంటి ప్లాన్ అతిక్రమించి ఇంటి ప్రహరీ గోడలు నిర్మించారని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దాదాపు పన్నెండు ఇళ్ళ ప్రహరీ గోడలను కూల్చి వేశారు.
రెండు జేసీబీల సాయంతో ప్రహరీ గోడలను కూల్చివేసిన సమయంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయినప్పటికీ నిరసనల మధ్యే కూల్చివేతలు కొనసాగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో ప్రహర పెట్టారు. గ్రామంలోకి వచ్చే వారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని మరీ ఊళ్ళోకి రాణిస్తున్నారు. కాగా కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పిల్లలు ఇవ్వడంతో కోపంతోనే ప్రభుత్వం గ్రామస్థుల గోడలు కూల్చివేస్తుందనే ఆరోపణలు వినవచ్చాయి. ఇప్పుడు కూల్చివేతలు మరోసారి తెరపైకి వచ్చాయి.