»India Defeated Pakistan In Mens Kabaddi Junior World Cup 2023
Kabaddi junior World Cup:లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్
పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్‌తో భారత్ జట్టు పోటీపడనుంది.
పురుషుల(mens) ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత(india) ఆటగాళ్లు అదరగొట్టారు. సెమీఫైనల్లో పాకిస్థాన్(Pakistan) జట్టును చిత్తుగా 75-29 తేడాతో ఓడించి ఫైనల్ చేరారు. అంతకుముందు మొదటి సెమీఫైనల్లో ఇరాన్ జట్టు(iron team) 60-27తో నేపాల్(nepal)ను ఓడించింది. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఇరాన్‌తో ఈరోజు భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. అయితే మహిళా కోచ్‌తో శిక్షణ పొందిన ఏకైక జట్టు నేపాల్(nepal)సెమీస్ చేరడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్ పోరులో ఇండియా(india) గెలుస్తుందో లేదో చూడాలి.
స్టార్ రైడర్ నరేందర్ కండోలా ఒక సూపర్ రైడ్ సాధించి మంచి ప్రక్రియను ఆరంభించాడు. అంతేకాదు నరేందర్ బోనస్(bonus)తో పాటు రెండు టచ్ పాయింట్లు సాధించి భారత్(india)కు కీలక ఆధిక్యాన్ని అందించాడు. అయితే ప్రారంభంలో కొన్ని నిమిషాల్లో డిఫెన్స్(defence) పాయింట్ల(points)ను కోల్పోయారు. అయితే కెప్టెన్ అంకుష్ రాథీ బలమైన ప్రదర్శనను అందించి అడ్వాన్స్ బ్యాక్ హోల్డ్‌లో ఉంచాడు. ఆ క్రమంలో సెకండరీ రైడర్, వైస్-కెప్టెన్ మంజీత్ విలువైన టచ్ పాయింట్ల(points)తో మొదటి అర్ధ భాగంలో(first half) ఆధిక్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచాడు.
ఇక రెండో అర్ధభాగంలో 20 పాయింట్లు (54-15) సాధించిన భారత ఆటగాళ్లు(indian players) వెనుదిరిగి చూసుకోలేదు. సెకండాఫ్‌లో తొలి ఐదు నిమిషాల తర్వాత పాకిస్థాన్ జట్టు ఒకే ఒక్క పాయింట్ మాత్రమే సాధించగలిగింది. దీంతో చివరికి భారత్ 46 పాయింట్ల (75-29) తేడాతో పాకిస్థాన్ టీం(Pakistan team)ను చిత్తుగా ఓడించింది.