అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి (chief minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నాలుగేళ్లలో 350 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 13వ స్థానానికి దిగజారిందని మండిపడ్డారు. పారిశ్రామిక రాయితీలు కూడా రూ.850 కోట్లు ఇవ్వలేదన్నారు. నాలుగేళ్లలో ఎందుకు ఒక్క సదస్సు జరపలేదు, ఒక్క పరిశ్రమ తేలేదని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. జే ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తున్నారని, కడప ఉక్కుకు శంకుస్థాపనలతో కాలం గడుపుతున్నారన్నారు. అచ్చన్న వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు.