»Obesity Danger Bells By 2035 World Wide 51 Percentage Of The Victims
Obesity: ఊబకాయం డేంజర్ బెల్స్..2035 నాటికి సగం మంది బాధితులే!
ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
ఊబకాయం(Obesity) లేదా స్థూలకాయం లేదా పొట్ట రావడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఊబకాయం శరీరంలోని వివిధ అవయవాలైన గుండె, కాలేయం, మూత్రపిండాలు, కీళ్లు సహా పలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే ఈరోజు మార్చి 4న ప్రపంచ స్థూలకాయ దినోత్సవం(World Obesity Day) సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా మార్చి 4న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అయితే ఊబకాయం(Obesity) అనేది ఒక పెద్ద సమస్యగా మారి 2035 నాటికి ప్రపంచ(world) జనాభా(population)లో 51 శాతం(51 percentage) మంది ఇదే వ్యాధి బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక(report) వెల్లడించింది. ఈ మేరకు వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2023 పేరుతో ప్రపంచ స్థూలకాయ సమాఖ్య ఓ నివేదికను ప్రచురించింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరు దాదాపు 1.9 బిలియన్ల ప్రజలకు ఈ వ్యాధి(disease) సోకనుందని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం గొప్ప పెరుగుదలను చూడగల దాదాపు అన్ని ఆసియా(asia) దేశాలతోపాటు ఆఫ్రికా(africa)లో కొన్ని లేదా మధ్య-ఆదాయ దేశాలు కూడా ఉంటాయని ప్రకటించింది.
అంతేకాదు ప్రధానంగా తక్కువ ఆదాయ దేశాల్లోని పిల్లల్లో ఊబకాయం(Obesity) రేటు వేగంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బాల్య స్థూలకాయం రేటు అబ్బాయిలలో 208 మిలియన్లకు రెట్టింపు అవుతుందని, బాలికలలో 125 శాతం పెరుగుదల 175 మిలియన్లకు చేరుతుందని వెల్లడించింది. మరోవైపు నైజర్, పాపువా న్యూ గినియా, సోమాలియా, నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాలు పెరుగుతున్న స్థూలకాయాన్ని ఎదుర్కోవటానికి అతి దగ్గరగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 25 బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నవారిని అధిక బరువుగా పరిగణిస్తారు. అది 30, అంతకంటే ఎక్కువ ఉన్న వారిని స్థూలకాయులుగా పరిగణిస్తారు. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల(food) పట్ల మక్కువ పెరగడం, ప్రజలు ఎక్కువగా శరీరానికి శ్రమ చెప్పకపోవడం వంటి కూడా స్థూలకాయం రావడానికి కారణాలుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆహార సరఫరా, మార్కెటింగ్‌ను నియంత్రించే బలహీన విధానాలు, బరువు నిర్వహణ, ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఊబకాయం స్థాయిలు వేగంగా పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై(world economy) కూడా ప్రభావం చూపుతుంది. స్థూలకాయం ప్రభావం 2019లో $1.96 ట్రిలియన్ నుంచి 2035 నాటికి $4.32 ట్రిలియన్లకు పెరుగుతుందని నివేదిక గుర్తు చేసింది. ఇది ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతానికి సమానమని తెలిపింది. ఇది COVID-19 ద్వారా సంభవించే ఆర్థిక నష్టంతో సమామని వెల్లడించింది. ఈ క్రమంలో ఊబకాయ బాధితులను తగ్గించడంలో విఫలమైతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.