»Who Revealed That The Life Expectancy Of People Has Decreased Due To Corona
WHO: కరోనా ప్రభావం.. తగ్గిన ఆయుష్షు
కరోనా ప్రభావం వలన మనిషి ఆయుర్దాయం తగ్గిపోయిందని డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. దానికి సంబంధించిన లెక్కలు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
WHO revealed that the life expectancy of people has decreased due to Corona
WHO: కరోనా మహమ్మారి చేసిన మారణకాండ ఇంకా ఎవరు పూర్తిగా మరిచిపోలేదు. దానికి వలన అనాదలుగా మారిన వారు, వలస కూలీలు ఇలా ఎన్నో చేదుగుర్తులను ఇచ్చింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా వలన మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని చెప్పింది. కరోనా వలన వాతావరణంలో కలిగిన మార్పులు, మానవ శరీరంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మనిషి ఆయుష్షు ఏకంగా ఒకటిన్నర సంవత్సరాలు తగ్గిందని పేర్కొంది. ప్రస్తుతం మనిషి సాధారణ ఆయుర్దాయం 73 ఏళ్లు. ఈ కరోనా కారణంగా 1.8 సంవత్సరాలు తగ్గిందని చెప్పింది. అంటే ఇప్పుడు యావరేజ్‌గా మనిషి ఆయుష్షు 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది.
అంతే కాదు కరోనా వలన మానవ శరీరంలో కూడా కొన్ని జబ్బులు అధికం అయినట్లు గుర్తించి. వీటిన్నింటి దృష్ట్యా ఓ మనిషి ఆరోగ్యంగా ఉండే వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు మాత్రమే అని ఆ తరువాత రకరకాల రోగాలతో మంచం పట్టే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికలో పేర్కొంది. ఇక వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మూడేళ్ల ఆయుర్దాయం తగ్గిపోయింది. ఆరోగ్యకరమైన జీవిత కాలం రెండున్నర సంవత్సరాలు తగ్గిందని పేర్కొంది. కరోనా ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని, అందువలన మనిషి ఆయుర్దాయం విషయంలో కూడా అదే మాదిరిగా ఉందని డబ్ల్యూహెచ్‌వో సైంటిస్టులు తెలిపారు.