అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారిగా ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ జంతువుల పచ్చి పాలలో చాలా ఎక్కువ పరిమాణంలో కనుగొనబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం తెలిపింది.
If you drink milk at night, how quickly you gain weight! Know the right time to drink it
H5N1: అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారిగా ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ జంతువుల పచ్చి పాలలో చాలా ఎక్కువ పరిమాణంలో కనుగొనబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం తెలిపింది. అయితే వైరస్ పాలలో ఎంతకాలం జీవించగలదో చెప్పలేకపోయింది. దీనికి సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో సమాచారం అందుబాటులో లేదు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) మొదటి సారి 1996లో ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి బర్డ్ ఫ్లూ తీవ్రత అధికమైంది. లక్షలాది పక్షులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. అయితే ఇది మనుషులు, పిల్లులు, ఎలుగుబంట్లు, నక్కలు, పెంగ్విన్లు, మింక్స్ వంటి జీవుల్లోనూ ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుండడం కలవరపరుస్తోంది. ఆవులు, మేకలను బర్డ్ ఫ్లూ ఏమీ చేయదనే భావన గతంలో ఉండేది. అయితే ఇటీవల పరిణామాలతో బర్డ్ ఫ్లూ బాధిత జీవుల్లో ఆవులు, మేకలను కూడా చేర్చారు. 2020 నుండి పక్షులలో వ్యాప్తి వేగంగా పెరిగింది. దీనితో పాటు సోకిన క్షీరదాల సంఖ్య కూడా పెరిగింది.
గత నెలలో ఆవులు, మేకల్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. టెక్సాస్లోని ఒక డెయిరీ ఫామ్లో పనిచేస్తున్న వ్యక్తికి పశువుల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రస్తుతం అతడు వైరస్ నుండి కోలుకుంటున్నాడని అమెరికా అధికారులు చెప్పారు. “ఒక ఆవు ద్వారా ఏవియన్ ఇన్ఫ్లుఎంజా బారిన పడిన మానవుని మొదటి కేసు టెక్సాస్ లోనిదే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని గ్లోబల్ ఇన్ఫ్లుఎంజా ప్రోగ్రామ్ హెడ్ వెంకింగ్ జాంగ్ అన్నారు. ఈ ప్రస్తుత వ్యాప్తి సమయంలో పక్షుల నుండి ఆవు, ఆవు నుండి ఆవు, ఆవు నుండి పక్షి ప్రసారం కేసులు కూడా నమోదు చేయబడ్డాయి.