ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లాపుల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. అందుకు 100 శాతం పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. ప్లాపులు తనకు కొత్త ఏం కాదని పేర్కొన్నాడు. ఒక దశలో వరుసగా 8, 16 చిత్రాలు హిట్టు కాలేదని గుర్తు చేశారు.
బతుకుదెరువు కోసం సొంత దేశం(Country) నుంచి విదేశాలకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పొరుగు దేశాలకు వలస వెళ్దామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాల(Boat Accidents)కు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఇటలీ(Italy) దేశంలో చోటుచేసుకుంది. ఇటలీ(Italy) తీరంలో పడవ మునిగి 34 మంది మృతి(34 Died) చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశం కోసం నడిచానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో భాగంగా తాను వేలాది మంది ప్రజలు, రైతుల సమస్యల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లో పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఢీల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ (CBI) అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ఆసక్తికర ట్వీట్ చేశారు. దేవుడు నీతో ఉన్నాడు మనీశ్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశంకోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు జైలుకు వెళ్లడం దుర్మార్గం కాదు, ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ...
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ క్రమంలో చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీ పౌరుడు మృతి చెందాడు. అతను స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్‌గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.
28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నెలల వైద్యం తర్వాత కోలుకున్నట్లు వెల్లడించింది.
సుదూర ప్రేమికులు, జంటల కోసం చైనాలో కొత్తగా ముద్దు పరికరం’ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా నిజంగా ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వివరాలు, రేటు గురించి ఈ కింది వార్తలో చూసేయండి.