pattabi get a bail..గన్నవరం కేసులో పట్టాభికి బెయిల్
pattabi get a bail:గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు (pattabi) బెయిల్ (bail) వచ్చింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితోపాటు (pattabi) మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
pattabi get a bail:గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు (pattabi) బెయిల్ (bail) వచ్చింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితోపాటు (pattabi) మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని స్పష్టం చేసింది. పట్టాభి తదితరులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఇటీవల గన్నవరంలో టీడీపీ ఆఫీసు బయట వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇంతలో అక్కడికి పట్టాభి (pattabi) వచ్చారు. అక్కడ ఉన్న సీఐ కనకరావు తనను కులం పేరుతో దూషించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభి (pattabi) తదితరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పట్టాభి అండ్ కోపై పోలీసులు 3 కేసులు (3 cases) పోలీసులు (police) ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (vamsi) అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటాంచారు. ఆఫీసులో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu), ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై (lokesh) వంశీ (vamsi) విమర్శించారు. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. తమ నేతను విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. పార్టీ కార్యాలయం లక్ష్యంగా దాడి చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన పట్టాభిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దనే కారణం చూపి అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న సీఐ.. తనను దూషించాడని కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.